తెలంగాణలో మరో 608 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 28,055 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 329 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 459 మంది
  • ఇంకా 5,146 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 28,055 శాంపిల్స్ పరీక్షించగా, 608 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 329 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 67, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, సంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 459 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,05,137 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,95,880 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,146 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Corona Virus
Telangana

More Telugu News